News March 21, 2024

భద్రాచలం బ్రిడ్జి పైనుంచి దూకి సూసైడ్

image

భద్రాచలం బ్రిడ్జి పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ఉదయం జరిగింది. పాల్వంచ వనమా కాలనీకి చెందిన తంగెళ్ల శేషం రాజ్ బ్రిడ్జి పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News April 16, 2025

ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి

image

ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో తమ ప్రాంతాల్లో విద్యుత్తు లైన్ల పై చెట్టుకొమ్మలు లేదా స్తంభాలు విరిగిపడినట్లు ఉంటే వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే 1912 నంబర్ కు కాల్, లేదా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని విద్యుత్ అధికారులు ప్రకటించారు.

News April 16, 2025

ఖమ్మం: తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయమై అర్హులై, ప్లాట్లు ఉన్న ఎల్1 జాబితాను ఎంపీడీవో సంతకంతో తీసుకుని ఆమోదం కోసం ఇందిరమ్మ కమిటీ ముందు ఉంచాలని సూచించారు. అలాగే వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News April 16, 2025

కొత్తగూడెం: యువతిని మోసం చేశాడు

image

కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన ఏసుదాస్ డేవిడ్(43) పెళ్లి చేసుకుంటా అని యువతిని(21) గర్భవతిని చేశాడు. సీఐ జె.ఉపేందర్ వివరాలు.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నా అంటూ శారీరికంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేవడంతోమొహం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

error: Content is protected !!