News March 26, 2025

భద్రాచలం: భవనం కూలిన ప్రమాదానికి ఇదే కారణం?

image

భ‌ద్రాచలంలో హఠాత్తుగా కూలిన భవనాన్ని ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి నిర్మాణం చేపట్టారట. నిబంధనలకు విరుద్ధంగా అలాగే నాసిరకం పిల్లర్లతో పాత భవనంపైనే నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టవద్దని హెచ్చరించారు. అటు యజమాని పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్క‌డికక్క‌డే చనిపోయినట్లు తెలుస్తోంది.

Similar News

News November 23, 2025

అంతరిక్ష విజ్ఞాన వీచిక.. స్పేస్ ఆన్ వీల్స్: కలెక్టర్

image

విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు, ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్‌ను కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. అంతరిక్ష రంగంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు.

News November 23, 2025

పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేవారు: MP కావ్య

image

గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టే వారని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో చీరల పంపిణీలో ఎంపీ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి రాజీపడబోమని, ప్రతి ఇంటికి వెలుగు చేరేలా, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.

News November 23, 2025

గిరిజన దర్బారుకు సకాలంలో హాజరు కావాలి: పీవో రాహుల్

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు తప్పక హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను అందజేయాలని కోరారు.