News February 6, 2025
భద్రాచలం : మహిళను మోసం చేసిన లాయర్పై కేసు నమోదు

మహిళను మోసం చేసిన లాయర్ పైన కేసు నమోదైన ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న మహిళ, తన భర్తపై చట్టపరంగా పోరాడేందుకు న్యాయవాది భరణి కార్తీక్ను ఆశ్రయించింది. ఒంటరిగా జీవిస్తున్న బాధిత మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి, గర్భం దాల్చిన తర్వాత కార్తీక్ పెళ్లికి నిరాకరించాడు. ఈ మేరకు ఆమె భద్రాచలం పోలీసులను ఆశ్రయించగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 16, 2025
పల్నాడు: కాక రేపుతున్న వారసత్వ రాజకీయాలు

పల్నాడు జిల్లాలో వారసత్వ రాజకీయాలు కాక రేపుతున్నాయి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు తమ వారసులను రాజకీయ బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే తమ వారసులను ప్రజలలోకి పంపి రాజకీయ ఒడిదుడుకులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 16, 2025
త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.
News November 16, 2025
కిలిమంజారోను అధిరోహించిన అనంత జిల్లా యువతి

అనంతపురం(D) నార్పల(M) దుగుమర్రికి చెందిన కె.కుసుమ(19) ఈ నెల 8న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీస్టాండింగ్ పర్వతం కిలిమంజారో (5895M)ను 12న విజయవంతంగా అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాతో పాటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, MLA బండారు శ్రావణి ఫొటోలను ఎగురవేసింది. 15న హైదరాబాద్కు చేరుకోనుంది.


