News May 24, 2024
భద్రాచలం: మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఆందోళన

భద్రాచంలోని మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న కాలేజ్ ప్రాంగణలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య గాయాలతో పడి ఉండగా యాజమాన్యం ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కారుణ్య నిన్న సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో ప్రభుత్వాస్పత్రి నుంచి ర్యాలీగా కాలేజ్ వద్దకు చేరుకున్న విద్యార్థులు, బంధువులు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.
Similar News
News February 18, 2025
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీ ఏర్పాటు

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 14న సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదల కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. కమిటీ విశ్లేషణలు రాష్ట్రంలో స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలకు మద్దతుగా ఉంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు.
News February 18, 2025
గంగారంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఇంట్లో ఎవరూలేని సమయంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్తుపల్లి మండలం గంగారంలోని జలగం నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంచి రాధాకృష్ణ (30) గ్రామంలోని ఓ హోటల్లో పనిచేస్తుండగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రాధాకృష్ణ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
బోరుబావుల నుంచి ఉబికి వస్తున్న వేడి నీరు..!

భద్రాద్రి జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మణుగూరు మండలం పగిడేరులో పలు బోరుబావుల నుంచి వేడి నీరు ఉబికి వస్తోంది. ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి వేడినీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.