News July 14, 2024
భద్రాచలం రామయ్యకు సువర్ణ పుష్పార్చన

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం బస్టాండ్ వద్ద డ్రైనేజీలో మృతదేహం

ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని టూ టౌన్ పోలీసులు కోరారు.
News November 25, 2025
ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..!

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 25, 2025
19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 19మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. సీపీ సునీల్ దత్ మంగళవారం వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. వీరిలో నలుగురిని మహబూబాబాద్‌కు, 14 మందిని భద్రాద్రి కొత్తగూడెంకు, ఒకరిని ఇతర విభాగానికి కేటాయించారు.


