News March 9, 2025
భద్రాచలం రాములవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

భద్రాచలం రాములవారి బ్రహ్మోత్సవాల ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్నాయి. 30న కల్పవృక్ష వాహన సేవ, 31, ఏప్రిల్ 1 తిరువీధి సేవలు, 2 గరుడ పట లేఖనం, 3 భద్రకమండలం లేఖనం, 4 అగ్ని ప్రతిష్ఠ, ద్వజారోహణం, 5 చతుఃస్థానార్చన, ఎదుర్కోలు, 6 కళ్యాణం 7 పట్టాభిషేకం, 8 సదస్యం,హంస వాహన సేవ, 9 తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వ వాహన సేవ, 10 సింహ వాహన సేవ, 11 వసంతోత్సవం, గజవాహన సేవ, 12 చక్రతీర్ధం,పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
Similar News
News March 10, 2025
పార్వతీపురం: దరఖాస్తుల ఆహ్వానం

సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లాలో 15 మండలాల ZPHS, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత గల ఉపాధ్యాయులు 12వ తేదీలోగా డీఈఓ కార్యాలయానికి వివరాలు తెలియజేయాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.
News March 10, 2025
తుని: యనమల రామకృష్ణుడికి దక్కని అవకాశం

టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల రామకృష్ణుడు పార్టీలో నంబర్-2గా ఉన్నారు. ఇటీవల ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి లేఖ రాశారు. దాంతో ఆయనపై అధిష్ఠానం గుర్రుగా ఉంది. ఈ నెల 29న ఎమ్మెల్సీగా ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఆయనకు మరో ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు. కానీ చంద్రబాబు రెన్యూవల్ చేయలేదు. తొలిసారి ఎలాంటి పదవి లేకుండా ఆయన ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడిందని క్యాడర్ చెబుతుంది.
News March 10, 2025
పెద్ద దోర్నాల హైవేలో సొరంగ నిర్మాణం..?

పెద్ద దోర్నాల మీదుగా రాయలసీమ ప్రాంతానికి వెళ్లే శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరించనున్నారు. ఈ ప్రతిపాదనలో మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ మార్గంలో పెరుగుతున్న వాహనాల రద్దీని పరిష్కరించడానికి సొరంగ మార్గం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. సొరంగం నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు ఉండవని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.