News September 15, 2024
భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదారమ్మ

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 34.9 అడుగులకు చేరిందని సీడబ్ల్యూసీ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి క్రమేపి తగ్గుతూ వచ్చింది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 19, 2025
ఖమ్మం: యువ అభివృద్ధి పథకం.. దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ యువ కౌమార అభివృద్ధి పథకం ద్వారా గ్రాంట్-ఇన్-ఎయిడ్(జీఐఏ) కోసం ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసుల అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, నాన్- గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు(NGO)ఈ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీఐఏ పోర్టల్ ద్వారా మాత్రమే అందిన దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.
News November 19, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో మంత్రి తుమ్మల పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కూసుమంచిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేటి నుంచి పత్తి కొనుగోలు పునఃప్రారంభం
News November 19, 2025
మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా

రేపు సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో జరగాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మార్పును గమనించాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.


