News March 13, 2025
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిత్య కళ్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దర్శన భాగ్యం పొందారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Similar News
News November 2, 2025
విజయనగరం టీంకు ఓవరాల్ ఛాంపియన్ షిప్

ఏలూరులో జరిగిన 69వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-17 విభాగంలో విజయనగరం బాలికలు జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తారు. వీరందరినీ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అభినందించారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో కూడా మార్మోగించాలన్నారు.
News November 2, 2025
వనపర్తి: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేయండి

2025లో ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. అదే విధంగా గతంలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైన వారు రెన్యువల్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు https://scholarships.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 2, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.


