News March 13, 2025
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిత్య కళ్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దర్శన భాగ్యం పొందారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Similar News
News March 7, 2026
నిర్మల్: భరోసా కల్పించి.. 133 జంటలను కలిపారు

నిర్మల్ జిల్లాలోని భరోసా కేంద్రం ద్వారా కుటుంబ సమస్యలు, చిన్న చిన్న మనస్పర్థలు, క్షణికావేశంతో దూరంగా ఉన్న133 జంటలను జిల్లా పోలీసులు ఒక్కటి చేశారు. భరోసా కేంద్రంలో భార్యాభర్తలకు నిశ్నాతుల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో సమస్యలను ఓపిగ్గా విని కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాలను మళ్లీ కలిపేలా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.
News March 7, 2026
జనగామ: 99 రోజుల కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో నిర్వహించే 99 రోజుల కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను పరిశీలిస్తూ, కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 7, 2026
ఇకపై రైతుల అకౌంట్లకే సబ్సిడీ నిధులు: తుమ్మల

TG: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులు కొనుగోలు చేసిన పనిముట్లకు 40% సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తోంది. ఇకపై అన్నదాతల ఖాతాలకే ఆ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. APR నెలాఖరులోగా పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించాలన్నారు. ఈసారి 60.60L హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.


