News April 6, 2025

భద్రాచలానికి సీఎం రాక.. భారీ బందోబస్తు

image

భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలిపాడ్ గ్రౌండ్ వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం 10.45 గంటలకు భద్రాద్రి ఆలయానికి సీఎం రానున్నారు.

Similar News

News September 15, 2025

నక్కపల్లి: ధర్నా చేసిన పలువురిపై కేసులు నమోదు

image

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఆదివారం ధర్నాలో పాల్గొన్న 13 మంది మత్స్యకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.ఎ రిపల్లి నాగేశ్వరరావు, ఎం.మహేష్, ఎం.బైరాగి, జి.స్వామి, కె.కాశీరావు పి.రాము తదితరులపై పోలీసులు కేసులు పెట్టారు. ధర్నాకు అనుమతులు లేని కారణంగా కేసులు నమోదు చేసినట్లు సీఐ కుమారస్వామి తెలిపారు.

News September 15, 2025

హైదరాబాద్‌కు ‘మోక్షం’ ప్రసాదించారు

image

1908..HYD మరిచిపోలేని ఏడాది. మూసీలో భారీ వరదలు వేలమందిని బలిగొన్నాయి. మరోసారి పునరావృతం కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909లో ద్విముఖ వ్యూహం రచించారు. అదే మూసీ ప్రాజెక్ట్‌. వరదల నియంత్రణ, తాగునీటి కష్టాలు తీర్చేలా ట్వీన్ రిజర్వాయర్స్ ఆయన ఆలోచనల నుంచే పుట్టాయి. టెక్నాలజీ పెద్దగా లేనప్పుడే నేటికి చెక్కుచెదరని పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థ HYDకు అందించారు. నేడు ఆ మహాజ్ఞాని జయంతి సందర్భంగా స్మరించుకుందాం.

News September 15, 2025

కలెక్టర్ల కాన్ఫరెన్స్.. చర్చించే అంశాలు ఇవే

image

AP: ఇవాళ, రేపు సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, హౌసింగ్, సూపర్ సిక్స్ పథకాలు, పీ-4, అన్న క్యాంటీన్లు, సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టుల పురోగతిపై చర్చించనున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు విద్య, వైద్యం, రెవెన్యూ తదితర అంశాలపై చర్చ జరగనుంది.