News January 18, 2025

భద్రాద్రికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విరాళం..!

image

భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రూ.1,02,322 విరాళం ప్రకటించింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉదయ్ బ్యాంకు సిబ్బందితో కలిసి విరాళాన్ని ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమాదేవికి అందజేశారు. బ్యాంకు సిబ్బందిని ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 7, 2025

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన

image

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. మండాలపాడుకి చెందిన గోపీచంద్‌ తాను 7ఏళ్లుగా ప్రేమించుకున్నామని.. కొద్ది రోజుల క్రితం తనకు వేరే వ్యక్తి వివాహమైందని బాధితురాలు తెలిపింది. భర్తను వదిలేసి తన వద్దకు రావాలని గోపిచంద్ వేధించడంతో భర్తకు విడాకులు ఇచ్చానట్లు వెల్లడించింది. తీరా వచ్చిన తరువాత గోపిచంద్ ముఖం చాటేస్తున్నాడని అవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టింది

News February 7, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌కు 70 వేల బస్తాలు..!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 70 వేల బస్తాలు మార్కెట్‌కు రావడంతో షెడ్‌లు అన్ని కళకళలాడాయి. గురువారం జెండా పాట క్వింటాకు రూ.14,025 ధర పలకింది. గత ఏడాది రూ.20వేలకు పైగా ధర లభిస్తే.. ఇప్పుడు రూ.14వేలుగా ఉంది. ఈ ధర గత ఏడాది తాలు మిర్చికి వచ్చిన ధర కావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి మిర్చి మార్కెట‌కు వచ్చింది.

News February 7, 2025

కమర్షియల్ షాపులకు ఆన్‌లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC DY.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్ సైట్ Tgsrtc.telanagana.gov.in (Tenders)లో టెండర్‌కు దరఖాస్తు చేసుకువాలన్నారు. 

error: Content is protected !!