News February 3, 2025
భద్రాద్రిలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్.. ఎందుకు?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. క్యాడర్‌కు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందుబాటులో ఉండడం లేదని టాక్. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా నేతలు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి.. ఎలాంటి హామీలు ఇవ్వాలో తెలియక లోకల్ లీడర్స్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 24, 2026
బాధితులకు మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వండి: సీఎం

AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల కలకలం నేపథ్యంలో CM CBN అధికారులతో సమీక్ష నిర్వహించారు. 32 మంది డయేరియా బారినపడ్డారని, వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. రోడ్డు రిపేర్ పనుల వల్లే నీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని CM ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News February 24, 2026
సిద్దిపేట: వీడని స్నేహం!

సిద్దిపేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట మున్సిపాలిటీ అటెండర్ బొమ్మల పృథ్వీరాజ్, తన స్నేహితుడు నవీన్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీరాజ్ అక్కడికక్కడే మృతి చెందగా, నవీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టూ టౌన్ CI ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 24, 2026
VKB: ఒకే దూరం.. భారీ వ్యత్యాసం!

తాండూర్ నుంచి హైదరాబాద్‌కు 110 కిలోమీటర్లు. బస్సు ఛార్జ్ రూ.160 అదే రైలు ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ రూ.55 ఉంది. బస్సులో వెళ్లే వారికి తీవ్రంగా కాలయాపన జరుగుతుండగా అదే రైల్లో వెళ్లే వారు తక్కువ సమయంలో HYD చేరుకుంటున్నారు. రైలు ఛార్జ్ కేవలం రూ.55 ఉండి 2 గంటల్లో హైదరాబాద్ చేరుకుంటున్నామని ప్రజలు చెబుతున్నారు. బస్సులో రూ.160 పట్టినా ఆలస్యం అవుతోందని, దీనిపై ఉన్నతాధికారులు ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు.


