News February 13, 2025
భద్రాద్రిలో విషాదం.. ఇద్దరి దుర్మరణం (UPDATE)

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘోర <<15448249>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు చింతగుప్ప పరిధిలోని సుజ్ఞానాపురం గ్రామానికి చెందిన భూక్యా హరిబాబు(40), భూక్యా సోమ్లా(36) లుగా గుర్తించారు. అకాల మరణంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 25, 2025
నర్సంపేట: ఆ కుటుంబంలో విషాదం నింపిన విద్యుత్ ప్రమాదం.. UPDATE

మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన <<18386600>>గర్భిణి విద్యుత్ షాక్తో<<>> మృతి చెందింది. నర్సంపేటలోని సర్వపురానికి చెందిన దార అనిల్కు ప్రత్యూష(34)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ప్రత్యూష ప్రస్తుతం 7 నెలల గర్భిణీ. బట్టలు ఆరేస్తుండగా ముందున్న విద్యుత్ తీగలకు తాకి షాక్ కొట్టి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ అధికారులపై అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 25, 2025
కొత్తగూడెం: ‘రూ.304 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు’

మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.304 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు విడుదల కావడం మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని చెప్పారు.
News November 25, 2025
BHPL: ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఐడీవోసీలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో గాంధీ నగర్లోని 16 మంది లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గృహాల కేటాయింపు ధ్రువపత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు.


