News March 30, 2025
భద్రాద్రి: అత్తమామను కత్తితో పొడిచిన అల్లుడు

అత్తమామలపై అల్లుడు కత్తితో పొడిచిన ఘటన అశ్వాపురం మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ అశోక్ రెడ్డి వివరాలిలా.. తన భార్య స్రవంతి గత రెండేళ్లుగా కాపురానికి రావడం లేదని భర్త శ్రావణ్ అశ్వాపురంలోని అత్తగారింటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. అడ్డువచ్చిన మామ నరసింహులు, అత్త వనజాక్షిని కత్తితో గాయపరిచారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.
Similar News
News December 1, 2025
చొప్పరివారిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

నల్గొండ జిల్లా చండూరు మండలం చొప్పరివారిగూడెం సర్పంచ్గా జాల వెంకన్నను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఆయన సంతోషించి, గ్రామ అభివృద్ధికి తన వంతుగా రూ.18.16 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.
News December 1, 2025
ASF: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
హసీనాపై మరో కేసు! భారత్పైనా ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని <<18408910>>షేక్ హసీనా<<>>పై మరో కేసు పెట్టేందుకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమైంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనా కారణమని చెబుతోంది. ఆ హింసాకాండలో భారత్ ప్రమేయం కూడా ఉందని అక్కడి సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలో పేర్కొంది. బంగ్లా ఆర్మీని బలహీనపరిచేందుకు ఆ హింసకు భారత్ మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తోంది. 2009 హింసాకాండలో సీనియర్ ఆర్మీ అధికారులు సహా 74 మంది మరణించారు.


