News March 26, 2025

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

image

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

Similar News

News November 24, 2025

భద్రాద్రి BRSలో ముసలం.. రేగా వర్సెస్ సీనియర్లు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు, సీనియర్లకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అశ్వారావుపేట, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయట. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలో నెలకొన్న కుమ్ములాటల కారణంగా ఇబ్బందులు తప్పవని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

News November 24, 2025

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అసీమ్ బిన్ అబ్దుల్లా

image

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న శంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అసీమ్ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. మొత్తం 54 ఓట్లు పోలవ్వగా ఆసీమ్ బిన్ అబ్దుల్లాకు 41 ఓట్లు, గీత అగర్వాల్ 13 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలను స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేసన్న ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.

News November 24, 2025

అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి CP సజ్జనార్

image

హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. లంగ‌ర్‌హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్‌కాలనీల్లోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ హెచ్చరించారు.