News March 26, 2025
భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.
Similar News
News April 24, 2025
నెల్లూరులో డిగ్రీ యువకుడి సూసైడ్

ఫెయిల్ కావడంతో ఓ యువకుడ సూసైడ్ చేసుకున్న ఘటన నెల్లూరులో జరిగింది. సిటీలోని హరనాథపురానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(22) డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మార్చి 31న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చెన్నైకి తీసుకెళ్లారు. తర్వాత నెల్లూరుకు తీసుకు వచ్చి ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అతను చనిపోయాడు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 24, 2025
పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. కేసు

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై మంగళవారం ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు పలువురు అస్వస్థతకు గురవ్వగా, మరికొంత మంది ఊపిరాడక బయటకు పరుగులు తీసేటప్పుడు గాయాలపాలయ్యారు. దీనిపై ఓ మహిళా కార్మికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు స్టేషన్ రైటర్ నాగరాజు తెలిపారు.
News April 24, 2025
వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు: పాలస్తీనా అధ్యక్షుడు

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ హమాస్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయుధాలను, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు. ‘హమాస్ కుక్కల్లారా.. బందీలను వెంటనే విడిచిపెట్టండి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధం ఆగాలి. బందీల కోసమంటూ ఆ దేశం నరకం సృష్టిస్తోంది. వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు’ అని సూచించారు. కాగా హమాస్‌పై పాలస్తీనా నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం ఇదే తొలిసారి.