News March 22, 2025

భద్రాద్రి: ఇంకుడుగుంతలతో.. నీటిని ఒడిసిపడుదాం!

image

నీరు మానవాళి ఆరోగ్యానికి శ్రేయస్కరం. కానీ బాధ్యతారాహిత్యంతో దుర్వినియోగమవుతుండగా, మార్చి 22న జల దినోత్సవం నిర్వహించి, అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో భద్రాద్రి జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, మినీ వాటర్ హోల్స్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అలాగే చెరువులు, కుంటలనూ పునరుద్ధరించాలి. నీటి వృథాపై పిల్లలకు అవగాహన కల్పిస్తే భవిష్యత్తు అవసరాలకు ఢోకా లేనట్లే.

Similar News

News November 23, 2025

కార్తీకం వెళ్లినా.. తగ్గని కూరగాయల ‘ఘాటు’

image

కార్తీక మాసం ముగిసినా కూరగాయల ధరల జోరు మాత్రం తగ్గలేదు. రైతుబజార్లలో సైతం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్‌లో ఆకాకర రూ.130, చిక్కుడు రూ.110, వంకాయ, బీర రూ.70, టమాటా రూ.60 పలుకుతున్నాయి. ఇక బీన్స్ గింజలు ఏకంగా రూ.300కు చేరాయి. ధరల మోతతో కూరగాయలు కొనలేక పచ్చడి మెతుకులే గతి అవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

News November 23, 2025

చిత్తూరు: ఏనుగులను తరిమెందుకు ఏఐ నిఘా!

image

చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఏఐ కెమెరా, లౌడ్ స్పీకర్‌తో అనుసంధానం చేసి అమర్చి ఏనుగులు వచ్చినప్పుడు గుర్తించి లౌడ్ స్పీకర్ ద్వారా తుపాకుల శబ్దం చేసేలాగా అమర్చారు. చిత్తూరు సమీపంలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా సత్ఫాలితలు వచ్చాయి. దీంతో పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట, బంగారుపాలెంలో అమర్చేందుకు చర్యలు చేపట్టారు.

News November 23, 2025

ప.గో: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

image

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాల్లో డేటా ఎంట్రీ ప్రారంభమైందని, మిగిలిన చోట్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాన్నారు.