News March 6, 2025
భద్రాద్రి : ఇంటర్ పరీక్షలు.. మొదటి రోజు 439 మంది గైర్హాజరు

భద్రాద్రి జిల్లాలో మొదటిరోజు ఇంటర్ మొదటి సం.. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. మొత్తం 9,939 మంది ఉండగా తొలిరోజు 9,446 మంది హజరు కాగా 439 మంది గైర్హజరయ్యారని తెలిపారు. జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
Similar News
News October 13, 2025
ఖమ్మం: విద్యార్థిపై టీచర్ లైంగిక దాడి

విద్యార్థిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనిజర్లలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిపై అదే స్కూల్లో జువాలజీ టీచర్‌గా పని చేస్తోన్న ఉపాధ్యాయుడు కొద్ది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల సెలవులకు ఇంటికెళ్లిన విద్యార్థి పేరెంట్స్‌కు చెప్పడంతో వారు కొనిజర్ల PSలో ఫిర్యాదు చేశారు.
News October 13, 2025
ఏలూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంజే అభిషేక్ గౌడ

ఏలూరు జాయింట్ కలెక్టరుగా ఎంజే అభిషేక్ గౌడ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూల గుత్తి అందించారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ మరింత పట్టిష్టంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని, రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నూతన జేసీకి సూచించారు.
News October 13, 2025
పెంట్లవెల్లి: అసంపూర్తిగా కాలిన యువతి శవం లభ్యం

మండలంలోని మంచాలకట్ట సమీప చింతరాయగుట్ట వద్ద గుర్తుతెలియని యువతి అసంపూర్తిగా కాలిన శవం లభ్యమైంది. సమాచారం అందుకున్న SI రామన్ గౌడ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. యువతి శరీరంపై పైజామా, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు ఉన్నట్లు గుర్తించారు. యువతిపై అత్యాచారం చేసి కాల్చి చంపి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే ప్రాంతంలో గతంలో బాలుడిని హత్య చేసి కాల్చిన సంఘటనతో ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందుతున్నాయి.