News March 6, 2025
భద్రాద్రి : ఇంటర్ పరీక్షలు.. మొదటి రోజు 439 మంది గైర్హాజరు

భద్రాద్రి జిల్లాలో మొదటిరోజు ఇంటర్ మొదటి సం.. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. మొత్తం 9,939 మంది ఉండగా తొలిరోజు 9,446 మంది హజరు కాగా 439 మంది గైర్హజరయ్యారని తెలిపారు. జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు కేటాయించింది. నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు ఇవ్వగా.. పాలమూరు ప్రాజెక్టుకు రూ.1715కోట్లు దక్కాయి. పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు ఇచ్చింది. బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.
News March 20, 2025
నరసరావుపేట: వర్క్ ప్రెజర్ వల్లే ఆత్మహత్య?

నరసరావుపేటలో బల్లికురవ(M) గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు(29) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమని సమాచారం. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఆయన.. వర్క్ ప్రెజర్ వల్ల జాబ్ చేయలేకపోతున్న అంటూ సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలుస్తోంది. ఉద్యోగం వదిలేస్తే భార్య తరఫు బంధువులు మాటలు అంటారేమో అని, అమ్మ, నాన్న క్షమించండి అని సూసైడ్ నోట్‌లో రాసినట్లు సమాచారం.
News March 20, 2025
గ్రోక్ బూతులు.. వివరణ కోరిన కేంద్రం

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో AI చాట్‌బాట్ (గ్రోక్) సృష్టిస్తున్న వివాదాస్పద ప్రతిస్పందనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల గ్రోక్ హిందీలో అభ్యంతకర రీతిలో బూతు రిప్లైలు ఇచ్చింది. దీంతో గ్రోక్ హిందీ యాస దుర్వినియోగంపై కేంద్రం స్పందించింది. గ్రోక్ ఉత్పత్తి చేసిన ఆన్సర్లు, చాట్‌బాట్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిన డేటాకు సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ నుంచి వివరణ కోరింది.