News February 2, 2025
భద్రాద్రి కలెక్టరేట్లో రేపు ప్రజావాణి కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
నేడు కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని ఐడీఓసీ ప్రాంగణంలో ఉదయం 10:00 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సీతారాం తెలిపారు.
News December 9, 2025
NGKL: జిల్లాలో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

నాగర్కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 10.6, తెలకపల్లి 11.0, తాడూర్ మండలం యంగంపల్లిలో 11.1, అమ్రాబాద్లో 11.2, ఊర్కొండ 11.5, వెల్దండ 11.6, బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
News December 9, 2025
పుట్టగూడెం, మల్లన్నగూడెం మరోసారి ఏకగ్రీవం

గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాజాపేట మండలంలోని పుట్టగూడెం, మల్లన్నగూడెం గ్రామ పంచాయతీలు ఈసారి కూడా ఏకగ్రీవమయ్యాయి. పుట్టగూడెంలో 332 మంది ఓటర్లు, మల్లన్నగూడెంలో 759 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో గ్రామ పెద్దలు, నాయకుల సమన్వయంతో శాంతియుతంగా ఏకగ్రీవం సాధించారు. ప్రజల ఐక్యతతో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకున్న ఈ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి.


