News February 2, 2025
భద్రాద్రి కలెక్టరేట్లో రేపు ప్రజావాణి కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
నిర్మల్: గురుకుల విద్యార్థినిని అభినందించిన ప్రధాని

సోఫీ నగర్ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఎస్ వర్షితకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సెప్టెంబర్ మాసంలో జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రయోగాత్మక నైపుణ్య అభివృద్ధి భారత నిర్మాణంలో 5 మౌలిక సూత్రాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రజెంటేషన్ ఇచ్చినందుకుగాను ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురుకుల విద్యార్థి హర్షితకు హర్షితకు లేఖ పంపారు.
News February 9, 2025
కుంటాల గ్రామంలో సగానికి పైనే అమ్మవారి పేర్లు

కుంటాలలో సుమారు నాలుగువేల పైచిలుకు జనాభా ఉంది. తమ కోరికలు తీరుతుండటంతో ఊరిలో సగం మంది తమ పిల్లలకు అమ్మవారి పేరు పెట్టుకుంటున్నారు. ఇంట్లో పాప జన్మిస్తే గజ్జలమ్మ, గజ్జవ్వ బాబు జన్మిస్తే గజ్జయ్య, గజేందర్ గజ్జరామ్ అని నామకరణం చేస్తారు. కాగా సంతానం కలగకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్న, వ్యాపారంలో కలిసి రాకపోయినా, వ్యవసాయంలో నష్టాలు వచ్చిన, గజ్జలమ్మ దేవికి మొక్కుకుంటే ఆ కోరికలు తీరుతుందని భక్తుల నమ్మకం.
News February 9, 2025
కాలేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

కాలేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాలేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.