News February 6, 2025
భద్రాద్రి: కుటుంబ కలహాలతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్య.. UPDATE

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్ ఎస్సై సువర్ణపాక లక్ష్మీ నర్సు(36) <<15377589>>ఆత్మహత్యకు<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని 15వ బెటాలియన్‌కు చెందిన లక్ష్మీనర్సు భద్రాద్రి, బయ్యారం ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. భార్య సునీతను ఇంటి నుంచి గెంటి వేశారని, ఆమె హన్మకొండలోని బంధువుల ఇంటికి పిల్లలతో వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News March 27, 2025
సింహాచలంలో అప్పన్న స్వామికి నిత్య కళ్యాణం

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి గురువారం ఉదయం నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. బెల్లం, జీలకర్రతో పాటు ఊరేగిచారు. 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారిని పూజించి భక్తులకు వేదాశ్వీరచనాలు, శేష వస్త్రాలు అందజేశారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఈవో సుబ్బారావు ఇతర సిబ్బంది పర్యవేక్షించారు. అన్నదానం ఏర్పాట్లు చేపట్టారు.
News March 27, 2025
ఇంట్లో ఒకే బిడ్డ ఉంటే..!

తోబుట్టువులు లేకుండా పెరిగే పిల్లల్లో చాలా మంది ‘ఓన్లీ చైల్డ్ సిండ్రోమ్’ బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు సొంత అవసరాలు, కోరికలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో స్వార్థపరులుగా మారుతారు. ఇంట్లో ఒంటరితనాన్ని అనుభవించడంతో ఇతరులతో త్వరగా కలిసిపోలేరు. బాల్యమంతా ఏకాంతాన్ని అనుభవిస్తారు. షేరింగ్, అండర్‌స్టాడింగ్, సాల్వింగ్ వంటివి నేర్చుకోవడంలో వెనకబడతారు. పేరెంట్స్‌పై ఎక్కువ ఆధారపడతారు.
News March 27, 2025
కరుణ్ నాయర్‌కు BCCI నుంచి పిలుపు?

విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు BCCI ఆయనను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఇండియా-A జట్టులో ఆయనకు చోటు కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. కరుణ్ కొద్దిరోజులుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో 5, SMATలో 3 సెంచరీలు బాదారు. దీంతో ఆయనను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి.