News February 27, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.94% నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం4 గంటలకు ఎన్నికలు ముగిసే సమయానికి 91.94% ఓట్లు పోలైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2022 మంది ఓటర్లు ఉండగా 1859 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.
Similar News
News February 28, 2025
హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటి?: కనిమొళి

తమిళులపై కేంద్రం హిందీ భాషను రుద్దడంపై DMK MP కనిమొళి తీవ్రంగా మండిపడ్డారు. అసలు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆ భాష వల్ల ఏం సాధిస్తామన్నారు. తాను ఎన్నడూ హిందీ నేర్చుకోలేదని, స్కూలుకెళ్లే తన కుమారుడూ ఆ భాషను నేర్చుకోవడం లేదన్నారు. TNలోని ప్రతీ విద్యార్థికి హిందీ రావాలని లేదని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయనందుకు కేంద్రం రూ.5000Cr ఫండ్స్ను నిలిపివేసిందని ఆరోపించారు.
News February 28, 2025
ఎడపల్లి: గేదెలను కడగడానికి వెళ్లి వ్యక్తి మృతి

ఎడపల్లి పులి చెరువులో గురువారం సాలూర మండల కేంద్రానికి చెందిన మంగలి రమేశ్(35) గేదెలను కడగడానికి చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
News February 28, 2025
చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.