News February 26, 2026
భద్రాద్రి: కొత్త సర్పంచులకు ‘పాత’ బిల్లుల కష్టాలు

గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామ అభివృద్ధికి నిధులు లేక కటకటలాడాయి. ప్రస్తుతం కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతుండడంతో నూతన సర్పంచ్‌లు ఒకవైపు ఆనందంతో, మరోవైపు అసహనంగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్రం నుంచి వస్తున్న నిధులు గతంలో చేపట్టిన పనులకే చెల్లించాలని చెప్పగా ప్రస్తుత సర్పంచులు పాత బిల్లులు చెల్లించేందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 16, 2026
కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల్లో 20 వేల మంది మృతి

దేశవ్యాప్తంగా ఒకటిన్నర నెలలో సుమారు 20 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడంపై అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పోలీసుల చర్యల ద్వారానే కాకుండా, ప్రతి పౌరుడు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడే ఈ మరణాలను అరికట్టగలమని ఆయన పిలుపునిచ్చారు. ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నియమబద్ధంగా వాహనాలు నడపాలని సూచించారు.
News April 16, 2026
TU: పాలకమండలి సభ్యుడిగా ప్రొఫెసర్ ఆంజనేయులు

తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఆంజనేయులు టీయూ పాలకమండలి సభ్యుడిగా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ యూజీసీ కోఆర్డినేటర్‌గా, డిపార్ట్మెంట్ విభాగాధిపతి, బీఓఎస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను నియమించడం పట్ల పలువురు అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News April 16, 2026
HYD: BREAKING.. మంగ్లీ కేసులో రమావత్ మధు అరెస్ట్

మైక్రో ఫైనాన్స్ మోసాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మధుపై సైబరాబాద్ పరిధిలోని పలు PSలలో మోసపూరిత కేసులు నమోదు కాగా, తాజా అరెస్టుతో దర్యాప్తులో మరింత వేగం పుంజుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మధును పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో మంగ్లీ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.


