News February 13, 2025
భద్రాద్రి: కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వ్యక్తికి రిమాండ్

కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తికి మెజిస్ట్రేట్ కంభపు సూరి రెడ్డి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ వివరాలిలా.. 2023లో అశ్వాపురానికి చెందిన ముత్యంబోయిన వెంకటేశ్వర్లు అదే మండలానికి చెందిన సున్నం సత్యనారాయణకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అవి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. బాధితుడు కోర్టులో కేసు దాఖలు చేయగా, వాయిదాలకు రాకపోవడంతో రిమాండ్ విధించారు.
Similar News
News March 22, 2025
రేపు, ఎల్లుండి వర్షాలు

TG: నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు రాత్రి వరకు కొన్ని చోట్ల వాన పడుతుందని పేర్కొంది.
News March 22, 2025
జడ్చర్ల: ‘విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న పంటలు’

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక నీళ్లు పెట్టకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని కిష్టారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా Way2Newsతో రైతు పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా సరిగా లేక వేల పెట్టుబడితో పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని, విద్యుత్ అధికారులు స్పందించి 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలని అన్నారు.
News March 22, 2025
గద్వాల: ఈ ఫొటోకు ఐదేళ్లు..!

కరోనా కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలో నేటికి జనతా కర్ఫ్యూ విధించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ కూడా చాలావరకు సోషల్ మీడియా ద్వారా జనతా కర్ఫ్యూ పేరిట పోస్టులు చేసుకుంటున్నారు. నాటి గద్వాల కర్ఫ్యూపై తీసిన ఫొటో ఐదేళ్లు పూర్తి చేసుకుందని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.