News March 9, 2025
భద్రాద్రి: గిరిజనుల వంట రుచి చూసిన ఎమ్మెల్యే, కలెక్టర్

దుమ్ముగూడెం మండలం బొజ్జుగుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్గొన్నారు. మహిళ అధికారులు, మహిళ సంఘాలు, విద్యార్థులు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన మహిళ కళాబృందంచే నృత్య ప్రదర్శనలు, గిరిజన పండ్లు, పాలపండ్లు, రాగి జావ, జొన్న జావ, తేనే రుచి చూశారు.
Similar News
News December 5, 2025
మహబూబ్‌నగర్: వేలం పాటతో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: అరుణ

సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు అధికంగా ఉన్నవారే గెలిచేలా వేలం పాటలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఎంపీ డి.కె.అరుణ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని సర్పంచ్‌ను ఎన్నుకోవాలని కోరారు. ఏకగ్రీవం మంచిదే అయినా, డబ్బులతో కాకుండా ఏకగ్రీవం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
News December 5, 2025
13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్‌ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్‌తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.
News December 5, 2025
పాన్ మసాలాలపై సెస్.. బిల్లుకు ఆమోదం

పాన్ మసాలాలపై సెస్ విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025’ ద్వారా వీటి తయారీలో ఉపయోగించే యంత్రాలు, ప్రక్రియలపై సెస్ విధించనున్నారు. వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో(CFI) జమ చేసి జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నారు. ప్రస్తుతానికి పాన్ మసాలాలపైనే సెస్ అని, అవసరమైతే ఇతర ఉత్పత్తులకూ విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.


