News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Similar News
News November 15, 2025
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 12 గోదాముల ఏర్పాటు

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.155.68 కోట్ల నిధులతో 12 గోదాములను నిర్మించనుంది. వీటి సామర్థ్యం 1.51 లక్షల టన్నులు. కరీంనగర్ జిల్లా లాపపల్లి, నుస్తులాపూర్, ఉల్లంపల్లిలో, NLG జిల్లా దేవరకొండ, VKB జిల్లా దుద్యాల, హనుమకొండ జిల్లా వంగర, ములుగు జిల్లా తాడ్వాయి, మెదక్ జిల్లా అక్కన్నపేట, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, ఖమ్మం జిల్లా అల్లిపురం, ఎర్రబోయినపల్లి, మంచిర్యాల జిల్లా మోదెలలో వీటిని నిర్మించనున్నారు.
News November 15, 2025
నాబార్డు నిధులతో 14 గోదాములు ఏర్పాటు

TG: మరో 14 గోదాములను రూ.140 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్నారు. వీటి సామర్థ్యం 1.40టన్నులు. నాగర్కర్నూల్ జిల్లా పులిజాల, KMR జిల్లా జుక్కల్, మహ్మద్నగర్, మాల్తుమ్మెద, KMM జిల్లా కమలాపూర్, వెంకటాయపాలెం, MDK జిల్లా ఝరాసంగం, SRD జిల్లా బాచుపల్లి, MHBD జిల్లా తోడేళ్లగూడెం, కొత్తగూడ, జగిత్యాల జిల్లా చెప్యాల, మల్యాల, జనగామ జిల్లా రామచంద్రగూడెం, పెద్దపల్లి జిల్లా ధరియాపూర్లో వీటిని నిర్మిస్తారు.
News November 15, 2025
అనంత జిల్లాలో రేమండ్ గ్రూప్ ప్రాజెక్టుల శంకుస్థాపన

CII సమ్మిట్లో CM చంద్రబాబు రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1201 కోట్లతో 3 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆ సంస్థల డైరెక్టర్ గౌతమ్ మైనీ తెలిపారు. అనంతపురం(D) రాప్తాడులో రూ.479.67 కోట్లతో అప్పెరెల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, గుడిపల్లిలో ఆటో మాన్యుఫాక్చరింగ్ కాంపొనెంట్ ప్లాంట్, శ్రీ సత్యసాయి(D) టెకులోడు వద్ద గ్లోబల్ ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ వస్తోందన్నారు.


