News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Similar News
News November 28, 2025
గద్వాల: రెండో రోజు 100 సర్పంచ్ నామినేషన్లు..!

గద్వాల జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే గద్వాల, గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల్లోని 106 గ్రామ పంచాయతీలకు శుక్రవారం రెండో రోజు 100 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు నామినేషన్ వేశారు.
గద్వాల: 28
ధరూర్: 12
గట్టు: 22
కేటీ దొడ్డి: 6
వీటితో కలిపి మొత్తం 168 నామినేషన్లు దాఖలయ్యాయి.
News November 28, 2025
స్వమిత్వా సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్వమిత్వా సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలకు గాను 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు.
News November 28, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్: నారాయణ

AP: అమరావతిలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెందదని.. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎకరాలు ఇచ్చామని వివరించారు.


