News April 3, 2025
భద్రాద్రి జిల్లాకు వర్ష సూచన

భద్రాద్రి జిల్లాలోని ఈ నెల 5 వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News April 8, 2025
బోథ్: కత్తుల ప్రదర్శన చేసిన వారిపై కేసు నమోదు

బోథ్ మండల కేంద్రంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో బహిరంగంగా కత్తుల ప్రదర్శన చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ర్యాలీలో కార్తీక్, రాహుల్, ఆకాష్ అనే వ్యక్తులు బహిరంగంగా ర్యాలీలో కత్తుల ప్రదర్శన చేశారని ఎస్సై వివరించారు. నిబంధన విరుద్ధంగా ర్యాలీలో మరణ ఆయుధాలు ప్రదర్శించిన వారిపై సోమవారం కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు
News April 8, 2025
మానవపాడు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. కేసు నమోదు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మానవపాడు ఎస్సై చంద్రకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి ఇమ్రాన్ (24) మానవపాడు మండలం జల్లాపురం శివారులోని ఆర్టీఏ బార్డర్ చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు లారీ కింద పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రిలో తరలించగా, అక్కడి మృతిచెందారు. మృతుడి బాబాయ్ ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 8, 2025
ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు: చైనా

మరో 50శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తి లేదని చైనా తేల్చిచెప్పింది. ‘ఒత్తిడి పెట్టడమనేది మాతో మాట్లాడే విధానం కాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాం. సరైన పద్ధతిలో చర్చలు జరపాలి. మా హక్కులు, ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్య నుంచైనా మమ్మల్ని మేం కాపాడుకుంటాం’ అని చైనా రాయబారి లియూ పెంగ్యూ స్పష్టం చేశారు.