News April 3, 2025
భద్రాద్రి జిల్లాకు వర్ష సూచన

భద్రాద్రి జిల్లాలోని ఈ నెల 5 వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News April 20, 2025
IPL PLAYOFFS: ఏ జట్టు ఎన్ని గెలవాలంటే?

IPL 2025లో అన్ని జట్లు కనీసం 7 మ్యాచులు ఆడాయి. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. GT 7 మ్యాచుల్లో 3, DC 7 మ్యాచుల్లో 3, PBKS 7 మ్యాచుల్లో 3, LSG 6 మ్యాచుల్లో 3, RCB 7 మ్యాచుల్లో 4, KKR 7 మ్యాచుల్లో 5, MI 7 మ్యాచుల్లో 5, SRH 7 మ్యాచుల్లో 6, CSK 7 మ్యాచుల్లో 6, RR 6 మ్యాచులకు ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News April 20, 2025
పెద్దపల్లి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. నిన్న రాత్రి సుమారుగా 11, 12 గంటల సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పొత్కపల్లి గ్రామానికి చెందిన సుధగోని తిరుపతిగా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
టూత్ పేస్ట్‌లో హానికర సీసం, పాదరసం: లీడ్ సేఫ్ మామా

కొన్ని ప్రముఖ టూత్‌పేస్ట్ బ్రాండ్లలో విషపూరిత లోహాలు ఉన్నట్లు ‘లీడ్ సేఫ్ మామా’ సంస్థ అధ్యయనంలో తేలింది. 51 పేస్ట్ బ్రాండ్లను పరీక్షించగా వీటిలో చాలా బ్రాండ్లలో సీసం, ఆర్సెనిక్, మెర్క్యురీ, కాడ్మియం వంటి హానికర రసాయనాలు ఉన్నాయి. ఇవి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. కాగా ఈ బ్రాండ్లన్నీ తమ పేస్టుల్లో ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడుతున్నట్లు చెబుతున్నాయి.