News March 16, 2025

భద్రాద్రి జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) KG రూ. 160 ఉండగా, స్కిన్లెస్ కేజీ రూ. 180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 110 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు తెలుపుతున్నారు.

Similar News

News March 17, 2026

అనకాపల్లి: అక్షరాంధ్ర పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 15వ తేదీన నిర్వహించిన అక్షరాంధ్ర పరీక్షలో శత శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వయోజన విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 93,292 మంది వయోజనలు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు ముందు వీరికి మూడు నెలల పాటు రాయడం, చదవడం, లెక్కలు చేయడం నేర్పించినట్లు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం వయోజన విద్యాశాఖ అధికారులు ఫలితాలను విడుదల చేశారు.

News March 17, 2026

గర్భం దాల్చిన 15ఏళ్ల బాలిక

image

సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో మైనర్ బాలిక గర్భం దాల్చిన ఉదంతం కలకలం రేపింది. తండ్రి లేని బాలికపై వరుసకు బంధువైన వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవలే బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది. నిందితుడి ఘాతుకంతో 15 ఏళ్ల బాలిక గర్భవతిగా తేలడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే సామాజిక భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

News March 17, 2026

తూ.గో: సామూహిక అత్యాచారం.. హత్య.. శిరోముండనం.. చివరికి..!

image

కడియంలో 2024 అక్టోబరులో జరిగిన వివాహిత సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. నర్సరీలో పని ముగించుకుని వస్తున్న వివాహితను అపహరించి, అత్యాచారం చేసి, చంపి శిరోముండనం చేసిన అనంతరం కాలువలో పడేసిన నేవర యేసు, వెలుబుడి ప్రవీణ్, లోకిన జయప్రసాద్, దాసరి సురేశ్‌లకు 8వ అదనపు జిల్లా న్యాయాధికారి వై.బెన్నెం నాయుడు సోమవారం ఈ శిక్ష ఖరారు చేశారు.