News March 15, 2025
భద్రాద్రి జిల్లాలో జబర్దస్త్ నటుల సందడి

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ జగదాంబమాత జయలింగేశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఈవెంట్‌కు వచ్చిన జబర్దస్త్ నటులకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికింది. అనంతరం వారికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జ్ఞాపికలు అందించి, సత్కరించారు. తిరునాళ్లలో రాకెట్ రాఘవ టీం సందడి చేశారు.
Similar News
News February 12, 2026
మిషన్ పునర్వవనంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

మిషన్ పునర్వవనంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణలో తొలగించిన 100 సంవత్సరాల వయసుగల చెట్లకు పునర్జీవం కలిగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దీనిలో ఒక వృక్షాన్ని కలెక్టరేట్ ఆవరణలో నాటినట్లు పేర్కొన్నారు. మిషన్ పునర్వ వనం గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
News February 12, 2026
85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించింది. ఆయన కుడి కన్ను 85% విజన్ కోల్పోయిందని సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తెలిపారు. 3 నెలలుగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా జైలు అధికారులు చికిత్స అందించడం లేదని కోర్టుకు రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ రివ్యూకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఇమ్రాన్ 2023 AUG నుంచి జైలులోనే ఉన్నారు.
News February 12, 2026
శాలిగౌరారం: చిన్నారిపై వీధి కుక్క దాడి

ఆకారం గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న మనస్వి అనే 15 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచింది. రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది హేమంత్, సమీర్ చిన్నారిని హుటాహుటిన నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడదపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


