News April 24, 2024

భద్రాద్రి జిల్లాలో భానుడి భగభగలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 6 గంటల నుంచే ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా అశ్వాపురం మండలంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా బూర్గంపహాడ్‌లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Similar News

News January 4, 2026

ఖమ్మం: 150 మంది డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు

image

రవాణా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఎంవీఐలు దినేష్, సుమలత, రవిచందర్, వైద్యులు గౌతమ్, నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.

News January 4, 2026

ఖమ్మం: సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కళ్యాణం వెంకటేశ్వర్లు

image

సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఖమ్మం నగరానికి చెందిన కళ్యాణం వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల్లో ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

News January 4, 2026

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులను తొలగించేందుకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని ఆయన పేర్కొన్నారు.