News February 3, 2025
భద్రాద్రి జిల్లాలో భారీగా పడిపోయిన టమాట ధర

భద్రాద్రి జిల్లాలో టమాట ధర రూ.10కి పడిపోయింది. కొన్ని రోజుల క్రితం టమాటకు ధర భారీగా ఉండడంతో జిల్లాలో ఈ సాగుకు రైతులు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లెందు, బూర్గంపాడు, చండ్రుగొండ, కారేపల్లి మండలాల్లో కూరగాయల పంటల సాగులో భాగంగా రైతులు టమాటా సాగు చేస్తుంటారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు.
Similar News
News February 11, 2026
ఫీజు రీయింబర్స్‌మెంట్: కాలేజీల ఖాతాల్లోకే..

AP: నిన్న విడుదలైన రూ.1,200 కోట్ల <<19104256>>ఫీజు<<>> రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో 2024-25 బకాయిలు క్లియర్ కానున్నాయి. అయితే 2023-24కు సంబంధించి రూ.1,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ నిధులను తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్సులు పూర్తి చేసుకొని వెళ్లిపోయిన వారినుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
News February 11, 2026
ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అక్కడేనా?

అనంతపురం జిల్లాలో కార్గో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సుమారు 1,200 ఎకరాల భూమిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం కుడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద భూములను ఆర్డీవో కేశవ నాయుడు పరిశీలించారు. అనంతపురం సరిహద్దులోని కుడేరు మండలం, రాప్తాడు నియోజకవర్గంలోని కొంత భాగంలో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానున్నట్లు సమాచారం.
Photo: AI
News February 11, 2026
ఎన్నికలకు 750 మంది పోలీసు బందోబస్తు: డీసీపీ

జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికలకు మొత్తం 750 మంది పోలీస్ బందోబస్తును నియమించినట్లు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. రెండు చోట్ల అదనపు ఎస్పీతో పాటు ఏఎస్పీ, ఏసీపీ, సీఐలు 7, ఎస్సైలు 32 మంది, పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు బీఎస్ఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సైతం ఎన్నికల విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.


