News August 16, 2024
భద్రాద్రి జిల్లాలో మూడో విడత.. రూ.116.61 కోట్లు

మూడో విడతలో రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించగా భద్రాద్రి జిల్లాలో 10,859 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఆయా రైతులకు సంబంధించి రూ.116,61,44,302 మాఫీ కానున్నాయి. మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ జరగగా 28,018 మంది రైతులకు రూ.132.06 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షల రుణం మాఫీ చేయగా 16,377 మంది రైతులకు రూ.137.21 కోట్ల మేర లబ్ధి జరిగింది.
Similar News
News November 7, 2025
ఖమ్మం: వందేమాతరం గీతాలాపనలో ఇన్ఛార్జ్ కలెక్టర్

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మాట్లాడుతూ.. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
News November 7, 2025
ఖమ్మం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘వందే మాతరం’

జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో వందే మాతరం జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.
News November 7, 2025
కూసుమంచి: పంట నష్టం నమోదుకు పడవ ప్రయాణం

కూసుమంచి మండలం పాలేరు క్లస్టర్ ఏఈవో సాయిరాం తన వృత్తి నిబద్ధతను చాటారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు దారి లేకపోవడంతో, ఆయన ఓ మత్స్యకారుని సహాయంతో పడవపై ప్రయాణించారు. పంట నష్టాన్ని నమోదు చేసి, రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ సాహసం చేసిన ఏఈవో సాయిరామ్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి


