News March 14, 2025

భద్రాద్రి జిల్లాలో రేపటి నుంచే ఒంటి పూట బడులు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శనివారం(రేపటి) నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్స్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటి పూట బడులు పక్కాగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు.

Similar News

News March 15, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

image

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 66 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగలు 392 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,871, కనిష్ఠ ధర రూ.5,869, లభించింది. మొక్కజొన్న 596 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,321, కనిష్ఠ ధర రూ.2,127గా ఉంది. ఆముదాలు15 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,125, కనిష్ఠ ధర రూ.6,060 లభించింది.

News March 15, 2025

వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వేమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కఠివరంకు చెందిన బత్తి శ్రీధర్(28) గుంటూరుకు చెందిన తోట సోము కుమార్ లు కొల్లూరు నుంచి ద్విచక్ర వాహనంపై తెనాలి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టారు. శ్రీధర్ అక్కడికక్కడే మృతచెందగా సోము కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికృష్ణ తెలిపారు.

News March 15, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 365 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

image

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శనివారం 365 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ పి దుర్గారావు శనివారం తెలిపారు. 17,452 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 17,087 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన వివరించారు. 

error: Content is protected !!