News February 10, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

• తల్లితో గొడవపడి భద్రాచలం బాలిక ఆత్మహత్య• రైతు భరోసాకు ఎగనామం పెట్టారు: CPIML• పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే జారే • పాల్వంచ పెద్దమ్మతల్లి గుడిలో ముగిసిన పూజలు • సేవాలాల్ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ • ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు: అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్• బూర్గంపాడులో యథేచ్ఛగా ఇసుక రవాణా • గుండాలలో యువకుడి మృతి
Similar News
News November 20, 2025
బాలలకు విద్యాపరమైన సౌకర్యాలు కల్పించాలి: ఎస్పీ

బాలుర వసతి గృహాల్లో ఉన్న బాలలకు విద్యాపరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఏలూరు శనివారపుపేటలో ఉన్న బాలుర వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. అక్కడ ఉన్న 51 మంది బాలురకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం వారికి ఎస్పీ బహుమతులను అందజేశారు. వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఎస్పీ రాకతో బాలురు సంతోషించారు.
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.
News November 20, 2025
తిరుమల: వేగంగా ఫుడ్ ల్యాబ్ పనులు

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19.84 కోట్లు విడుదల చేసింది. ల్యాబ్ యంత్రాలు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ల్యాబ్ ప్రారంభించేలా పనులు చేస్తున్నారు.


