News March 7, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ✓ చండ్రుగొండలో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ ✓ గుండాలలో ఘనంగా పగిడిద్దరాజు జాతర ✓ సుజాతనగర్లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ✓ దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జిగా భవాని ✓ భద్రాచలం జడ్జి వినూత్న తీర్పు.. ముద్దాయిలతో హాస్టల్ పరిసరాలు శుభ్రం ✓ ఈనెల 9న సుజాతనగర్లో కాసాని ఐలయ్య సంస్మరణ సభ.

Similar News

News December 1, 2025

2026లోనే తేలనున్న కృష్ణా జలాల వివాదం!

image

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్-II తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని కేంద్రమంత్రి రాజ్ భూషణ్ వెల్లడించారు. నిర్ణయాన్ని వెల్లడించేందుకు గడువు పొడిగించాలని ట్రిబ్యునల్ కోరిందన్నారు. దీంతో 2025 AUG 1 నుంచి జులై 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో నీటి పంపకాల పంచాయితీకి వచ్చే ఏడాదే ముగింపు దొరకనుంది.

News December 1, 2025

WNP: అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి

image

ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమని, తమ విధులు,బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం మదనాపురం జెడ్పి బాయ్స్ హైస్కూల్ నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

News December 1, 2025

పెద్దపల్లి: 35 కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు డిసెంబర్ 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇన్చార్జ్ డీఈఓ శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ గౌడ్‌ (ఫోన్: 9959262737) ను సంప్రదించవచ్చు.