News March 22, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పెట్రోలింగ్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి:SP✓ పాల్వంచ: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్✓ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కొత్తగూడెంలో 3వ రోజుకు చేరుకున్న జర్నలిస్టుల దీక్ష ✓ పులుసు బొంత ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే పాయం ✓ కిన్నెరసాని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే కూనంనేని ✓ మణుగూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
Similar News
News April 24, 2025
జగిత్యాల: సమస్యకు పరిష్కారం ఆలోచించాలి: ఎస్పీ

సమస్యకు పరిష్కారం ఆలోచించాలి తప్పా, మానసిక వేదనకు గురి కాకూడదని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి గురువారం మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలపై అవగాహన శిబిరం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, అధికారులకు వ్యక్తిగత, మానసిక, శాఖపరమైన సమస్య ఉంటే ఆయన తెలియజేయాలన్నారు. వృత్తిపరంగా అత్యధిక ఒత్తిడి ఎదుర్కొనే రంగాలలో పోలీస్ శాఖ ఒకటన్నారు.
News April 24, 2025
జగిత్యాల: రేపు పోషణ మాసం ముగింపు ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలో పోషణ మాస ముగింపు ఉత్సవాలను శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరేశ్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉ.11గం.లకు పోషణ మాసం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారని, కావున మహిళలు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News April 24, 2025
ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ కీలక ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పరిధిలో కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇందులో డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ టీమ్స్ పాల్గొన్నాయని వెల్లడించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోల సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.