News March 23, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి హాజరుకానున్న సీఎం
✓ రేపు కలెక్టరేట్లో ప్రజావాణి
✓ జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి
✓ ఐటిడిఏ ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటాం:LHPS
✓ కొత్తగూడెం ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రామ సహాయం
✓ బెట్టింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ క్రైమ్ సీఐ
✓ రుణమాఫీలో మంత్రి తుమ్మల మాట తప్పారు: రైతు సంఘం
✓ దమ్మపేటలో యువకుడు ఆత్మహత్య

Similar News

News December 21, 2025

గిల్‌పై వేటు.. సూర్యకూ అల్టిమేటం!

image

T20ల్లో విఫలమవుతున్న గిల్‌ను వరల్డ్‌కప్ నుంచి BCCI <<18622627>>తప్పించిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలో రన్స్ చేయలేక తంటాలు పడుతున్న కెప్టెన్ సూర్య కుమార్‌కూ బోర్డు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫామ్‌ను అందుకోలేకపోతే జట్టులో చోటు కోల్పోవచ్చని హెచ్చరించినట్లు సమాచారం. ‘ఏడాదిగా పరుగులు చేయకున్నా కెప్టెన్ కావడం వల్ల జట్టులో ఉన్నాడు. పరుగులు చేయకపోతే గిల్‌ మాదిరే సూర్యపై వేటు పడొచ్చు’ అని PTI కథనం పేర్కొంది.

News December 21, 2025

ప్రపంచంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఇవే.. మనవెక్కడ?

image

ప్రపంచంలోని బిజీయెస్ట్ రైల్వే స్టేషన్ల లిస్ట్‌లో జపాన్ టాప్‌లో ఉంది. టోక్యోలోని ‘షింజుకు’ ఏడాదికి 116 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో తొలి స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏకంగా 8 ఆ దేశంలోనే ఉన్నాయి. ఇండియా నుంచి కోల్‌కతాలోని హౌరా స్టేషన్ 54 కోట్ల మందితో ఆరు, సియాల్దా స్టేషన్ ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నాయి. అధిక జనసాంద్రత, రోజూ ఆఫీసులకు వెళ్లేవారి రద్దీ వల్లే ఈ స్టేషన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోతున్నాయి.

News December 21, 2025

చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

image

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.