News February 12, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పురుగుమందు తాగి యువకుడి సూసైడ్ ✓ చిలకలగట్టు జాతరకు సర్వం సిద్ధం ✓ అర్చకుడిపై దాడిని ఖండించిన VHP ✓ హామీల అమలుకు ఈనెల 20న చలో హైదరాబాద్ లిస్టు ✓ మణుగూరు అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి ✓ పోలింగ్ విధుల్లో నిబంధనలు పాటించాలి: అదనపు కలెక్టర్ ✓ చిరుమళ్ల జాతర ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ ✓ ఏజెన్సీ చట్టాల జోలికి వస్తే సహించేది లేదు: ఆదివాసీ నాయకులు.
Similar News
News October 22, 2025
వనపర్తి: గురుకులాల్లో మిగిలిన సీట్ల దరఖాస్తుకు రేపే లాస్ట్

జిల్లాలోని SC వెల్ఫేర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 81 సీట్లు భర్తీ చేయనున్నట్లు ఇటీవల కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపిన విషయం తెలిసిందే. కాగా రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటల్లోపు కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీ సీట్ల భర్తీ కోసం TG CET ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లు ఉన్నాయి.
News October 22, 2025
ప్రకాశం జిల్లాకు NDRF బృందాలు: హోం మంత్రి

ప్రకాశం జిల్లాకు మరో రెండు రోజులపాటు భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగానికి హోం మంత్రి అనిత బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు NDRF బృందాలను పంపించేలా ఆమె ఆదేశించారు. దీంతో ప్రకాశం జిల్లాపై ఎలాంటి తుఫాన్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు, కలెక్టర్ రాజాబాబు సారథ్యంలో సిద్ధమయ్యారు.
News October 22, 2025
‘PMEGP పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలి’

PMEGP పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం పార్వతీపురంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ వర్కుషాప్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 యూనిట్లు ఏర్పాటు దిశగా అధికారులు ప్రయత్నించాలని సూచించారు. పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.