News March 31, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం
✓ గిరిజన దర్బార్ రద్దు
✓ ఘనంగా చిలకలగండి ముత్యాలమ్మ జాతర
✓ ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
✓ దుమ్ముగూడెంలో ఇసుక లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
✓ భద్రాచలం బిల్డింగ్ కూలిన ఘటనలో వ్యక్తి అరెస్ట్
✓ గుడుంబా స్థావరాలపై కరకగూడెం పోలీసుల దాడులు
✓ పేరాయిగూడెంలో 5 గుడిసెలు దగ్ధం
✓ భార్య పుట్టింటికి వెళ్లిందని.. మణుగూరులో భర్త ఆత్మహత్య
Similar News
News April 25, 2025
భారత్, పాక్ సంయమనం పాటించాలి: UN

పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తల నడుమ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలూ వీలైనంత సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత దిగజారనివ్వొద్దని సూచించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు.
News April 25, 2025
బుడగట్లపాలెం : సీఎం చేతుల మీదుగా రూ. 250 కోట్ల పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మత్స్యకార భరోసా పథకం కింద 250 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుడగట్లపాలెంలో గురువారం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 26న నిధులు పంపిణీకి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.
News April 25, 2025
మేయర్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: అంబటి

గుంటూరు మేయర్ ఎన్నికపై వైసీపీ అనూహ్య మలుపు తిరిగింది. పోటీలో వైసీపీ పోటీ చేయదని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అంబటి రాంబాబు అభ్యర్థిని ప్రకటిస్తామని గురువారం తెలిపారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు బృందావన్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.