News April 9, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓అశ్వాపురం ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో✓పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి:CPM✓జూలూరుపాడులో బైక్ ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు✓వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి: మైనారిటీ సెల్ ✓సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే పాయం ✓నాటు తుపాకులతో ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకున్న అశ్వారావుపేట పోలీసులు
Similar News
News December 1, 2025
NRPT: మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పదవి వీడి సర్పంచ్గా నామినేషన్

బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కూరగాయల రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి BRSలో చేరారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా తగిన గౌరవం లభించలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్లో చేరిన అనంతరం ధన్వాడ మండల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నీరటి సుజాత రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
News December 1, 2025
NLG: లంచం అడుగుతున్నారా..!

ఈనెల 3 నుంచి ఏసిబి తెలంగాణ వారోత్సవాలు-2025 నిర్వహిస్తున్నట్లు నల్గొండ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు 9వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యమన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్: వాట్సప్ నెంబర్: 94404 46106, ఫేస్ బుక్: ACBTelangana, X(పాత ట్విట్టర్): @TelanganaACB ద్వారా కంప్లయింట్ చేయవచ్చని తెలిపారు.
News December 1, 2025
TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.


