News February 14, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ భద్రాద్రి: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు ✓ యథేచ్చగా పంచాయతీ ఎన్నికలు జరపాలి: కలెక్టర్ ✓ భద్రాద్రిలో విషాదం.. ఇద్దరి దుర్మరణం ✓ అశ్వారావుపేటలో విద్యార్థులతో వెట్టిచాకిరి ✓ చిరుమళ్ల వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం ✓ ఇల్లందు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ✓ కొత్తగూడెంలో యథేచ్చగా ప్రభుత్వ భూముల కబ్జా ✓ బూర్గంపాడు: కారు, బైక్ ఢీ.. ✓ పర్ణశాలలో ఔషధ మోక్కలు నాటాలి: కలెక్టర్.
Similar News
News November 23, 2025
ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.
News November 23, 2025
సత్యవేడు: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITలో 2026 సంవత్సరానికి సంబంధించి MS (Research)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. 3 విభాగాలలో కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://iiits.ac.in/admissions/ms-research-programme/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
News November 23, 2025
హనుమకొండ: బహుమతులను అందజేసిన మంత్రి, ఎమ్మెల్యేలు

11వ తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


