News February 15, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ ములకలపల్లి: జామాయిల్ తోటలో కార్చిచ్చు ✓ రేపు జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత ✓ రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా మణుగూరు ఎమ్మార్వో ✓ రోంపేడు ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ✓ న్యాయమూర్తిపై దాడిని ఖండించిన కొత్తగూడెం, భద్రాచలం బార్ అసోసియేషన్ ✓ భద్రాచలం ఎస్సీ గర్ల్స్ హాస్టల్ గోడ నిర్మించాలని ధర్నా ✓ నేలకొండపల్లి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.
Similar News
News March 24, 2025
కాంగ్రెస్ అధిష్ఠానంతో రాష్ట్ర నేతల భేటీ

కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. మంత్రి వర్గ విస్తరణ, రిజర్వేషన్ల అంశం, డీలిమిటేషన్ వంటి అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.
News March 24, 2025
పీజీఆర్ఎస్‌కు 203 దరఖాస్తులు వచ్చాయి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలో దాదాపు 30 వేల అర్జీలు పరిష్కరించామన్నారు. సోమవారం పీజీఆర్ఎస్‌కు 203 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News March 24, 2025
వరంగల్: డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం: కలెక్టర్

వరంగల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల జిల్లా నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణా వినియోగంపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వీటి రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు.