News February 16, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పినపాక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి ✓ కొత్తగూడెం తాటిపల్లి రెసిడెన్సీలో అగ్ని ప్రమాదం✓ రేపు భద్రాద్రి కలెక్టరేట్, భద్రాచలం ఐటీడీఏలో ప్రజావాణి✓ పోలీసును ఢీకొట్టి మరీ పరారైన గంజాయి స్మగ్లర్✓ మున్నూరు కాపుల జనాభాను తగ్గిస్తే ఊరుకోం✓ మండలాల వారీగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల వివరాలు✓ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు మరో అవకాశం ✓ ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే
Similar News
News September 15, 2025
రుషికొండ: సముద్రంలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

రుషికొండ బీచ్లో ఆదివారం సాయంత్రం గల్లంతైన ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పీఎం పాలెం ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయి శ్యామ్ మరో ఇద్దరు బీచ్లో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. ఇద్దరిని పోలీస్ గార్డ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం సంజయ్, సాయి శ్యామ్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
News September 15, 2025
అనకాపల్లి: కాక రేపుతున్న బల్క్ డ్రగ్ పార్క్

అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కాక రేపుతోంది. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే ఈ ఇండస్ట్రీని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలిపిన 13 మందిపై నిన్న కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో ఈ పార్క్ను తూ.గో జిల్లాలో ఏర్పాటు చేయాలని చూడగా అక్కడ అడ్డుకున్నారని మత్స్యకారులు అంటున్నారు. దీంతో మత్స్య సంపద నాశనం అవుతుందని, తమ ఉనికే దెబ్బతింటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
News September 15, 2025
PDPL: విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్

తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(TGNPDCL) పరిధిలోని తెలంగాణ విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం (TPDEA) ఉపాధ్యక్షుడిగా పెద్దపల్లి ADE/ SPM అడిచర్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం హనుమకొండలో జరిగిన కార్యవర్గం ఎన్నికల్లో నాలుగో సారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్కు సహచర ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.