News February 16, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పినపాక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి ✓ కొత్తగూడెం తాటిపల్లి రెసిడెన్సీలో అగ్ని ప్రమాదం✓ రేపు భద్రాద్రి కలెక్టరేట్, భద్రాచలం ఐటీడీఏలో ప్రజావాణి✓ పోలీసును ఢీకొట్టి మరీ పరారైన గంజాయి స్మగ్లర్✓ మున్నూరు కాపుల జనాభాను తగ్గిస్తే ఊరుకోం✓ మండలాల వారీగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల వివరాలు✓ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు మరో అవకాశం ✓ ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే
Similar News
News March 27, 2025
జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు: సీఎం రేవంత్

TG: నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని CM రేవంత్ అన్నారు. డీలిమిటేషన్‌పై CM అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా నియంత్రణ ఆ రాష్ట్రాలకు శాపంగా మారకూడదు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారు’ అని గుర్తు చేశారు.
News March 27, 2025
హుజూరాబాద్ : రేషన్‌లో సన్నబియ్యం.. బియ్యం అక్రమ రవాణాకు చెక్

రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు రేషన్‌కార్డు దారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేది. అయితే చాలామంది లబ్ధిదారులు వాటిని తినేందుకు ఇష్టపడక అక్రమ వ్యాపారులకు అమ్ముకునే వారు. అయితే ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనుండటంతో లబ్ధిదారులు వాటిని వాడుకునే అవకాశం ఉంది. దీంతో బియ్యం అక్రమ రవాణా చేసే వ్యాపారులకు చెక్ పెట్టినట్లు కానుంది.
News March 27, 2025
సిద్దిపేట: తండ్రి మందలించాడని.. కొడుకు ఆత్మహత్య

తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోహెడ (M) రాంచంద్రపూర్‌కు చెందిన సుంకరి నాగయ్య గొర్రెల కాపారి. ప్రశాంత్(19) ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఏ పని చేయడం లేదని తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ 21న పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు KNR ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.