News February 20, 2025
భద్రాద్రి జిల్లా TOP NEWS

✓భద్రాచలం సరిహద్దు గ్రామాల్లో పోలీసుల ముమ్మర తనిఖీ✓ భద్రాచలంలో చైన్ స్నాచింగ్ ✓ సేవాలాల్ జయంతి వేడుకల్లో స్టెప్పులేసిన జిల్లా కలెక్టర్ ✓ మణుగూరులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత ✓ సంపన్నుల కోసమే కేంద్ర బడ్జెట్: సీపీఎం✓ జాతరలో ఎమ్మెల్యే కోరం కనకయ్య డాన్స్ ✓ భద్రాచలంలో ఎండు గంజాయి పట్టుకున్న పోలీసులు ✓ అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు: భద్రాద్రి ఎస్పీ
Similar News
News November 17, 2025
శాలిగౌరారం: Way2News ఎఫెక్ట్.. ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం

శాలిగౌరారం(M) ఆకారం గ్రామంలో ఉన్న అతి పురాతనమైన సూర్య దేవాలయం జీర్ణోద్ధరణకు ఇక్కడి యువత నడుం బిగించింది. ఇటీవల Way2Newsలో ‘నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఆకారం, పెర్కకొండారం గ్రామానికి చెందిన 400 మంది యువకులు, యువజన సంఘాలు శ్రమదానం చేసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 17, 2025
కోదాడ: ‘ప్రతి రంగంలోనూ మహిళల అద్భుత ప్రతిభ’

మానవ వికాసంలో మహిళల శ్రమ పెద్ద విప్లవం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప అన్నారు. కోదాడలో ఆదివారం నిర్వహించిన సూర్యాపేట జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. గణ సమాజం నుంచి నేటి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ స్త్రీలు అద్భుత ప్రతిభ చూపారని కొనియాడారు. అయితే సమాజం మారుతున్న క్రమంలో స్త్రీని అణగదొక్కారని విమర్శించారు.
News November 17, 2025
‘మైథాలజీ’తో మ్యాజిక్.. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా!

పురాణాలు, ఇతిహాసాలను లింక్ చేస్తూ టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. పురాణ పురుషుల కథలతో వచ్చిన కల్కి(మహాభారతం), హనుమాన్(రామాయణం), కార్తికేయ-2(శ్రీకృష్ణుడు), మిరాయ్(అశోకుడు, శ్రీరాముడు) వంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలోని ‘వారణాసి’, చిరంజీవి-వశిష్ట మూవీ ‘విశ్వంభర’ ఈ కోవలోనివే కావడం గమనార్హం.


