News January 22, 2025

భద్రాద్రి: దివ్యాంగులకు ఆర్థిక పునరావాస కోసం దరఖాస్తులు

image

2024-25 సంవత్సరానికి గాను దివ్యాంగులు.. ఆర్థిక పునరావాస పథకం ద్వారా స్వయం ఉపాధి, పునరావాసం, చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలనుకునే వారికి నాన్ బ్యాంక్ లింకేజీ యూనిట్ల కోసం అన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల దివ్యాంగులు ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 2 తేదీ వరకు https:tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News November 25, 2025

కుల్దీప్ యాదవ్ @134

image

ఇదేంటి అనుకుంటున్నారా? దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతుల సంఖ్య. 11 మందిలో 100 బంతులకు‌పైగా ఎదుర్కొన్నది ఆయనే కావడం గమనార్హం. 134 బంతులను ఎదుర్కొన్న కుల్దీప్ 19 పరుగులు చేశారు. జైస్వాల్ 58(97), సుందర్ 42(92) చేశారు. కాగా రెండో ఇన్నింగ్సులోనైనా వీలైనంత ఎక్కువ టైమ్ క్రీజులో ఉంటేనే భారత్ ఓటమి నుంచి తప్పించుకోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.

News November 25, 2025

అనంత: ఆ నిందితులకు 14 రోజుల రిమాండ్

image

అనంతపురం సాయి నగర్ 3rd క్రాస్‌లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు మొత్తం ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించామన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు ఒక మోటార్ సైకిల్ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

News November 25, 2025

నవంబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1926: 21వ సీజేఐ రంగనాథ్ మిశ్రా జననం
1964: వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం
1968: సినీ దర్శకుడు ముప్పలనేని శివ జననం
1972: సినీ నటి సుకన్య జననం
2010: ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు మరణం(ఫొటోలో)
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మరణం
* అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం