News February 12, 2025
భద్రాద్రి: నిధులు దుర్వినియోగం.. ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష

భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో రూ.23,89,750 ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై భద్రాచలం జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అప్పటి పంచాయతీ కార్యదర్శి బత్తిన శ్రీనివాస రావు, సర్పంచ్ ధరావత్ చందునాయక్కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని బూర్గంపాడు SI రాజేశ్ తెలిపారు.
Similar News
News October 23, 2025
మదనాపురం, వీపనగండ్లలో ఖాళీలు ఇలా..!

మదనాపురం, వీపనగండ్లలోని బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఖాళీల వివరాలు..
✓ 5వ తరగతిలో SC కేటగిరీ 3, ST-1, BC-2, OC -2, మైనారిటీ-1 మొత్తం 9 ఖాళీలు.
✓ 6వ తరగతిలో SC 7, ST-1, BC-1, మైనారిటీ-1, OC-2 మొత్తం 12 ఖాళీలు.
✓ 7వ తరగతిలో SC-1, మైనారిటీ-1 మొత్తం 2 ఖాళీలు.
✓ 8వ తరగతిలో SC-7, ST -1, మైనారిటీ-1 మొత్తం 9 ఖాళీలు.
✓ 9వ తరగతిలో SC-9, ST-2, BC-1, OC-2, మైనారిటీ-1 మొత్తం 15 ఖాళీలు. దరఖాస్తుకు నేడే LAST
News October 23, 2025
కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబర్ 08672-252572 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా 24/7 సహాయచర్యలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
News October 23, 2025
ద్వారకాతిరుమల: రూ. 97 కోట్ల చెక్కు అందజేత

ద్వారకాతిరుమలలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ర్యాలీ కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొని మండల సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం డ్వాక్రా సంఘాలకు శ్రీనిధి పథకం ద్వారా 16,654 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.97,62,95,000 చెక్కును అందజేశారు.